
ఢీ షోలో కంటెస్టెంట్ గా ఉన్న అన్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె అటు సీరియల్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. "నేను బిగ్ బాస్ సీజన్ 7 కి ట్రై చేశా కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 కల్లా నేను సీరియల్ కమిట్ అయ్యాను. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్. దాంతో అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అదే ఛానెల్ లోని సీరియల్ కాబట్టి ఇక ఇప్పుడు బిగ్ బాస్ అంటే కష్టం." అని చెప్పింది అన్షు రెడ్డి. "నన్నైతే ఇంతవరకు ఎవరూ అప్రోచ్ కాలేదు. ఇంటరెస్ట్ ఉంది ఎందుకంటే లైఫ్ లో దొరికే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అందుకే. బిగ్ బాస్ కి వెళ్లడం ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవచ్చు. నేనేంటో నాకు తెలీదు. నేను రోజూ అద్దం ముందు నిలబడి చూసుకోలేను కదా. ఏ సిట్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకు తెలీదు. నేనేంటో తెలుసుకోవాలి, నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటానో తెలియాలి అనే ఒక ఇంటరెస్ట్ ఉంది. అందుకే బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకుంటున్నా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం సోషలైజ్ అవడం నేర్చుకుంటున్నాం. మంచి ఫ్రెండ్స్ ని చేసుకుంటున్నాం అని చెప్పింది శ్రీప్రియా. "ఇది వరకు ఫస్ట్ పే 70 రూపాయలు తీసుకున్నా...ఇప్పుడు రోజుకు బ్రాండ్స్ కి ప్రమోషన్స్ అలాంటివి చేసినప్పుడు 7 లక్షలు అలా వస్తాయి. ఇది వరకు యూట్యూబ్ మీద మంచి పేమెంట్ వచ్చేది. కానీ ఇప్పుడు అసలు యాక్టివ్ గా ఉండడం లేదు" అని చెప్పింది అన్షు రెడ్డి.
---------